NTV Telugu Site icon

Tollywood: ఈ ‘సాలా’ అనే పదాన్నే బాన్ చెయ్యాలి మావా…

Sala

Sala

అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో ఏజెంట్ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. అక్కేని అభిమానులు, అఖిల్ భారి ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ టాక్ నెగటివ్ గా స్ప్రెడ్ అవుతూనే ఉంది. క్రిటిక్స్ కూడా నెగటివ్ రివ్యూస్ ఇవ్వడంతో ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. సరిగ్గా ఏజెంట్ హైప్ తోనే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ గతేడాది ఆడియన్స్ ముందుకి వచ్చింది ‘లైగర్’ సినిమా. పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్, విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా లైగర్ సినిమాని కాపాడలేకపోయారు.

హిట్ ఫ్లాప్ అనేది ఇండస్ట్రీలో మామూలే కానీ లైగర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ లో విజయ్ దేవరకొండ, ఏజెంట్ సినిమాలో అఖిల్… ఈ ఇద్దరూ తమ పాత్రల కోసం ఎంతో కష్టపడ్డారు, సిక్స్ ప్యాక్ కూడా చేశారు. అంత కష్టానికి ఫలితం ఇచ్చే కథని ఎంచుకోవడంలో మాత్రం ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. లైగర్, ఏజెంట్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సోషల్ మీడియాలో ‘సాలా’ పదం వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఏమో ‘సాలా క్రాస్ బ్రీడ్’ అన్నాడు, అఖిల్ ఏమో ‘వైల్డ్ సాలా’ అన్నాడు. ఈ రెండింటిలో సాలా అనేది కామన్ గా ఉంది, ఇది చాలదన్నట్లు ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ ఆర్సీబీ ఇప్పటివరకూ IPL కప్ కొట్టలేదు. అలా సాలా అనే పదమే నెగటివ్ గా ఉంది, దాన్ని వాడిన ఒక్కరికి కూడా కలిసి రాలేదు అంటూ కామెంట్స్ మొదలయ్యి అది కూడా ఫన్నీగానే లెండి. కథలో విషయం, ఆటలో కసి ఉంటే చాలు ‘సాలా’ అనే సెంటిమెంట్ గెలుపుని ఆపలేదు. అఖిల్, విజయ్ దేవరకొండలు నెక్స్ట్ సినిమాలతో అయినా హిట్స్ కొడతారేమో చూద్దాం.