Akhil Akkineni: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. మొదటి సినిమా నుంచి.. ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కొద్దిగా ఊరట నిచ్చినా.. ఏజెంట్ సినిమా మరీ అయ్యగారిని పాతాళంలోకి దించేసింది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కిక్ లాంటి హిట్ సినిమా ఇస్తాడని సురేందర్ రెడ్డిని ఏరికోరి ఎంచుకున్నాడు అఖిల్. ఏజెంట్ సినిమా అనౌన్స్ చేసినదగ్గరనుంచి పాన్ ఇండియా అని హైప్ ఇచ్చారు. ఇక అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అమ్మ బాబోయ్ .. బీస్ట్ లా ఉన్నాడు.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని థియేటర్ కు వెళ్లి బొక్కాబోర్లా పడి బయటకు వచ్చారు. సినిమా కథ కన్నా.. అందులో లోపాలే ఎక్కువ కనిపించాయి అభిమానులకు. ఇక ఆ డిజాస్టర్ తో అఖిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఏజెంట్ రిలీజ్ అయిన వెంటనే.. డిజాస్టర్ టాక్ రావడంతో అఖిల్.. మాల్దీవ్స్ కు వెళ్ళిపోయాడు. అక్కడ కొన్నిరోజులు గడిపి ఇండియా వచ్చిన అయ్యగారు.. ఇప్పటివరకు బయట ఎక్కడా కనిపించలేదు. తన తరువాతి సినిమా ఎవరితో.. అనేది కూడా ఇప్పటివరకు ప్రకటించింది లేదు.
Nani: రాజకీయాల్లోకి నాని.. తనకే ఓటు వేయాలని మనవి
ఇక ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న అఖిల్.. తాజాగా తమన్ వలన బయటకు వచ్చాడు. పార్టీలకు వెళ్లడం అఖిల్ కు కొత్తేమి కాదు. మొన్న మెగాస్టార్ దీవాళీ సెలబ్రేషన్స్ లో కూడా అఖిల్ పాల్గొన్నాడు. కానీ, ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. అయితే నిన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పుట్టినరోజు వేడుకులకు అయ్యగారు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అయ్యగారు కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో హెయిర్ కు క్యాప్ పెట్టి .. ఇంకా ఏజెంట్ లుక్ లోనే దర్శనమిచ్చాడు. ఇక అఖిల్ ను చూడగానే.. అయ్యగారు.. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అఖిల్ తన తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.