Site icon NTV Telugu

Akhanda : టెలివిజన్ రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ

Akhanda

Akhanda

నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సోల్ ఫుల్ మ్యూజిక్ అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : Thalapathy 66 : గ్రాండ్ లాంచ్… పూజా కార్యక్రమాలతో స్టార్ట్

ఇప్పటి వరకూ థియేటర్ల, ఓటిటిలో పూనకాలు తెప్పించిన “అఖండ” జాతర ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపించబోతోంది. “అఖండ” మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ 10, ఆదివారం సాయంత్రం 6 గంటలకు టీవీ టీఆర్పీలను బద్దలు కొట్టడానికి “అఖండ” రెడీ అయ్యింది. స్టార్ మాలో ఈ మూవీ ప్రసారం కానుంది. థియేటర్లలో, అటు ఓటిటిలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న “అఖండ” మూవీని మరోసారి స్మాల్ స్క్రీన్ పై కుటుంబ సమేతంగా చూసి ఆనందించడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version