Site icon NTV Telugu

‘అఖండ’ విజయం సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి ?

akhanda

akhanda

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘అఖండ’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసుకుందాం.

నైజాం : 10.5 కోట్లు,
సీడెడ్ : 10.6 కోట్లు,
ఉత్తరాంధ్ర : 6 కోట్లు,
తూర్పు గోదావరి : 4 కోట్లు,
పశ్చిమ గోదావరి : 3.5 కోట్లు,
గుంటూరు : 5.4 కోట్లు,
కృష్ణా : 3.7,
సిఆర్ నెల్లూరు : 1.8 కోట్లు,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం : – 45.5 కోట్లు
కర్ణాటక+భారతదేశంలో : 5 కోట్లు,
ఓవర్సీస్ : 2.5 కోట్లు,
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: 53 కోట్లు

Read Also : “అఖండ” ట్విట్టర్ రివ్యూ

మొత్తంగా ఈ సినిమా రూ.54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఇంతటి భారీ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి పెద్ద తెలుగు సినిమా ‘అఖండ’. అయితే ఇప్పుడు ఈ సినిమా ‘అఖండ’మైన విజయం సాధించాలి అంటే ప్రీ రిలీజ్ బిసినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలి. అంటే దాదాపుగా 60 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. మొదటి షో నుంచే సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడం పెద్ద కష్టం ఏం కాదనిపిస్తోంది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా మే 28న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే రెండవ కరోనా వైరస్ కారణంగా మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని నమ్మకంగా ఉన్నారు చిత్రబృందం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version