Akhanda 2-Balakrishna: ఇదెక్కడి పిచ్చిరా మామ.. ‘మాన్షన్ హౌజ్’ మందుతో బాలయ్యకు దిష్టి!
- ‘అఖండ 2-తాండవం’ విడుదల వాయిదా
- అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా
- మాన్షన్ హౌజ్ మందుతో బాలయ్యకు దిష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్ చాలా నిరాశ చెందారు. తన అభిమాన హీరోకు దిష్టి తగిలిందేమో.. అందుకే సినిమా వాయిదా పడిందని భావించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ఓ థియేటర్ వద్ద ‘మ్యాన్సన్ హౌస్’ మందుతో బాలయ్య పోస్టర్‌కు అభిషేకం చేసి దిష్టి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. నిమ్మకాయలు, గుమ్మడి కాయతోనే దిష్టి తీయాలి కానీ.. మందుతో తీయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ కాబట్టి.. దాంతోనే దిష్టి తీశారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
Also Read: Raashii Khanna: ‘బెల్లం శ్రీదేవి’కి వరుస ఫ్లాపులు.. టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు సినిమా రిలీజ్ చేయవద్దని మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఆర్థిక లావాదేవిల ఇష్యూ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కోసం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి తమకు నిర్మాత నుంచి రావాల్సిన రెమ్యునరేషన్‌ను వదులుకున్నారట. బాలయ్య రూ.7 కోట్లు, బోయపాటి రూ.4 కోట్లు వదులుకున్నారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్, రేపు సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!