నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్ చాలా నిరాశ చెందారు. తన అభిమాన హీరోకు దిష్టి తగిలిందేమో.. అందుకే సినిమా వాయిదా పడిందని భావించారు. హైదరాబాద్ నగరంలోని ఓ థియేటర్ వద్ద ‘మ్యాన్సన్ హౌస్’ మందుతో బాలయ్య పోస్టర్‌కు అభిషేకం చేసి దిష్టి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. నిమ్మకాయలో, గుమ్మడి కాయతోనే దిష్టి తీయాలి కానీ.. మందుతో తీయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ కాబట్టి.. దాంతోనే దిష్టి తీశారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Raashii Khanna: ‘బెల్లం శ్రీదేవి’కి వరుస ఫ్లాపులు.. టాలీవుడ్‌లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు సినిమా రిలీజ్ చేయవద్దని మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఆర్థిక లావాదేవిల ఇష్యూ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కోసం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి తమకు నిర్మాత నుంచి రావాల్సిన రెమ్యునరేషన్‌ను వదులుకున్నారట. బాలయ్య రూ.7 కోట్లు, బోయపాటి రూ.4 కోట్లు వదులుకున్నారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్, రేపు సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
