Site icon NTV Telugu

Akhanda 2 : అఖండ2 నుంచి మరో సాంగ్ రిలీజ్.. బాలయ్య, సంయుక్త స్టెప్పులు

Balakrishna

Balakrishna

Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్‌ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే వచ్చిన టీజర్, తాండవం సాంగ్ అదిరిపోయింది.

Read Also : Kayadu Lohar : కుంభకోణంలో హీరోయిన్ పేరు.. ఆమె ఏమన్నదంటే..?

ఇప్పుడు తాజాగా సంయుక్త, బాలయ్య కలిసి చేసిన డ్యాన్స్ స్టెప్పుల వీడియోను రిలీజ్ చేశారు. పాట మొదటి విజువల్స్ నుంచే బాలయ్య మార్క్ ఎనర్జీ క్లియర్‌గా కనిపిస్తుంది. పవర్‌ఫుల్ బీట్‌పై ఆయన వేసిన యాక్షన్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయిస్తున్నాయి. ఇద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై కొత్త తాజాదనాన్ని తీసుకొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బీజీఎం అదిరిపోయింది. జాజికాయ అంటూ సాగే లిరిక్స్ బాగానే ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ రూపొందించినట్టు తెలుస్తోంది. సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Exit mobile version