Site icon NTV Telugu

Akhanda 2 Release Date: బాలయ్య అభిమానులకు శుభవార్త.. ‘అఖండ-2’ విడుదలకు లైన్ క్లియర్, రిలీజ్ ఎప్పుడంటే?

Akhanda 2

Akhanda 2

నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి.

నిజానికి అఖండ-2 మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని రీతిలో అడ్డంకి ఎదురైంది. ఫైనాన్షియల్ వివాదాల కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని.. ఆ డబ్బు చెల్లించే వరకు అఖండ-2 సినిమాను నిలిపివేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాసు కోర్టును ఆశ్రయించింది. ఈరోస్ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ లోగా సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్ అన్ని క్లియర్ అయ్యాయి. దాంతో సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేనొక్కడినే, ఆగడు చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొంది.

Also Read: IND vs SA: భారత జట్టులో అతడితోనే మాకు బిగ్ టెన్షన్: మార్‌క్రమ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ-2. అఖండకు ఇది సీక్వెల్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందుకు సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. విషయం తెలిసిన బాలయ్య ఫాన్స్ సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నారు.

 

Exit mobile version