తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున పేరు ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. నాగార్జున టాలీవుడ్ లో హీరోగా చేస్తూనే హిందీలో ‘బ్రహ్మాస్త్ర’లో అతిథిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను కూడా ఈ పాత్ర కోసం మేకర్స్ పరిశీలిస్తున్నారు.
Read Also : సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!
కాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో సౌత్ నుంచి పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అజిత్ పక్కన అదితి రావు హైదరీ కథానాయికగా నటించనుంది. ఈ నెలలో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసి ఆరు నెలల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ నెక్స్ట్ మూవీ ‘వాలిమై’ ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక నాగార్జున ఇటీవలే ‘బంగార్రాజు’తో హిట్ అందుకుని, నెక్స్ట్ మూవీ ‘ఘోస్ట్’ షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.