NTV Telugu Site icon

AK 64 : మరోసారి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అజిత్ కుమార్..?

Ak

Ak

హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్‌కు బాగా అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ పంథా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాస్, విష్ణువర్థన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్‌లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్.

Also Read : Prashanth Neel : KGF – 3లో తమిళ స్టార్ హీరో..?

ఈ ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన విదాముయర్చి హిట్టు అయ్యుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్‌ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మగిజ్‌ తిరుమేనికి. కానీ బొమ్మ థియేటర్లలో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మగిజ్‌. ఇక రీసెంట్లీ రిలీజైన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కర్షన్ అంతా ఏకే 64పైనే నడుస్తోంది. అజిత్ నెక్ట్స్ సినిమాను డీల్ చేసేది ఎవరన్న డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్‌తో సినిమా చేయాలని వార్తలు వచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్‍లో బజ్ నడుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను  డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫమ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ ఏకేతో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తోంది. అజిత్ 64ను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. హై ఓల్టేజ్ మూవీగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీని తర్వాతే ధనుష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి.