కోలీవుడ్ స్టార్ తల అజిత్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “వాలిమై” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అజిత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” జనవరి 14న పొంగల్ పండుగ ట్రీట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అజిత్ అటు నుంచి అటే ఆల్ ఇండియా పర్యటనకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన, ఆయన బైకుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అజిత్ తాను 18 ఏళ్ళ వయసు నుంచే బైక్, కార్ రేసులను ఇష్టపడతానని, కానీ జాగ్రత్తలు తీసుకుని మాత్రమే అలాంటివి చేస్తానని వెల్లడించాడు.
Read Also : ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?
తాజాగా కొనసాగుతున్న ఆల్ ఇండియా బైక్ ట్రిప్ నుండి అజిత్ మరో ఫోటోను పంచుకోగా, ఆ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ పిక్ లో అజిత్ బైకర్ దుస్తులు ధరించ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అజిత్ తన బైక్ మీద తిరిగి చెన్నై బయలుదేరి దాదాపు 2 వారాలు అయ్యింది. ఇప్పటివరకు ఆయన ఉత్తర భారతదేశంలోని పంజాబ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాంటి ప్రాంతాలు సందర్శించాడు. ఇప్పుడు రాజస్థాన్‌లోని అనేక పర్యాటక ప్రదేశాలలో పర్యటించాడు. ఈ నెలాఖరులో అజిత్ తన ట్రిప్ ముగించుకుని చెన్నైకి తిరిగి వస్తారని భావిస్తున్నారు.
