AK 62: ఆరేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న అజిత్, అనిరుద్ కాంబినేషన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో అజిత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకున్నా అజిత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఇటివలే వచ్చిన ‘తెగింపు’ సినిమా కూడా 280 కోట్లు రాబట్టి అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక యావరేజ్ సినిమాతో అన్ని కలెక్షన్స్ ని రాబట్టిన అజిత్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అజిత్ నెక్స్ట్ సినిమా ‘AK 62’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని లైకా ప్రొడ్యూస్ చేస్తుంది కానీ దర్శకుడు ఎవరు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మొదట్లో AK 62 సినిమాకి విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తాడు, మ్యూజిక్ సంతోష్ నారాయణ్ కంపోజ్ చేస్తాడు అనే టాక్ వినిపించింది. విజ్ఞేశ్ శివన్ కథ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో, అజిత్ ‘AK 62’ బాధ్యతలని ‘మగిళ్ తిరుమేణి’కి అప్పగించాడని సమాచారం.
Read Also: Hero Ajith : అజిత్ నెక్ట్స్ మూవీలో త్రిష అవుట్.. కాజల్ ఇన్?
Also Read
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
తడం లాంటి సూపర్ హిట్ కొట్టిన తిరుమేణి AK 62 డైరెక్ట్ చేస్తున్నాడు అనే వార్త కోలీవుడ్ లో వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ్ ప్లేస్ లో అనిరుద్ ని ఫైనల్ చేశారని సమాచారం. దళపతి విజయ్ సినిమాలకి బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్, అజిత్ తో ఎక్కువ సినిమాలు చెయ్యలేదు. అజిత్, అనిరుద్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలే వచ్చాయి. ‘వేదాలం’, ‘వివేకం’ సినిమాలకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 2017లో చివరిసారిగా అజిత్ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. AK 62కి అనిరుద్ మ్యూజిక్ చెయ్యడం కన్ఫామ్ అయితే మాత్రం అజిత్ ఫాన్స్ కి థియేటర్ లో ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనే చెప్పాలి. మరి AK 62 ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!