NTV Telugu Site icon

AK 62: ఆరేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న అజిత్, అనిరుద్ కాంబినేషన్…

Ak 62

Ak 62

తమిళనాడులో అజిత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకున్నా అజిత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఇటివలే వచ్చిన ‘తెగింపు’ సినిమా కూడా 280 కోట్లు రాబట్టి అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక యావరేజ్ సినిమాతో అన్ని కలెక్షన్స్ ని రాబట్టిన అజిత్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అజిత్ నెక్స్ట్ సినిమా ‘AK 62’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని లైకా ప్రొడ్యూస్ చేస్తుంది కానీ దర్శకుడు ఎవరు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మొదట్లో AK 62 సినిమాకి విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తాడు, మ్యూజిక్ సంతోష్ నారాయణ్ కంపోజ్ చేస్తాడు అనే టాక్ వినిపించింది. విజ్ఞేశ్ శివన్ కథ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో, అజిత్ ‘AK 62’ బాధ్యతలని ‘మగిళ్ తిరుమేణి’కి అప్పగించాడని సమాచారం.

Read Also: Hero Ajith : అజిత్ నెక్ట్స్ మూవీలో త్రిష అవుట్.. కాజల్ ఇన్?

తడం లాంటి సూపర్ హిట్ కొట్టిన తిరుమేణి AK 62 డైరెక్ట్ చేస్తున్నాడు అనే వార్త కోలీవుడ్ లో వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ్ ప్లేస్ లో అనిరుద్ ని ఫైనల్ చేశారని సమాచారం. దళపతి విజయ్ సినిమాలకి బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్, అజిత్ తో ఎక్కువ సినిమాలు చెయ్యలేదు. అజిత్, అనిరుద్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలే వచ్చాయి. ‘వేదాలం’, ‘వివేకం’ సినిమాలకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 2017లో చివరిసారిగా అజిత్ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. AK 62కి అనిరుద్ మ్యూజిక్ చెయ్యడం కన్ఫామ్ అయితే మాత్రం అజిత్ ఫాన్స్ కి థియేటర్ లో ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనే చెప్పాలి. మరి AK 62 ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Show comments