లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో, కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో, ఒక్క రోజు రాత్రిలో జరిగే కథగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంది. ఫైట్స్ తో పాటు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. సౌత్ లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చెయ్యడం మాములే కాదు, ఆ కోవలోనే ‘ఖైదీ’ సినిమాని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ‘ఖైదీ’ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఓన్ బ్యానర్ లో అజయ్ దేవగన్ ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ అనే టైటిల్ కూడా పెట్టారు.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రీసెంట్ గా విడుదల చేశారు. నార్త్ లో ‘భోలా’ గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ సౌత్ ఆడియన్స్ మాత్రం “ఇది ఖైదీలా లేదే” అంటూ కామెంట్స్ చేశారు. మరోసారి ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ‘భోలా’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ బయటకి వచ్చాయి. ‘అడ్డ నామాల’తో అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ లో బాగానే ఉన్నాడు కానీ ఈ పోస్టర్స్ చూస్తుంటే ఇది ‘ఖైదీ’ సినిమాకి రీమేక్ లా కాకుండా బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్ లా ఉన్నాయి. ఖైదీ సినిమాలో కార్తీ కూడా నామాలు పెట్టుకుంటాడు కానీ దానిపైనే ఫోకస్ ఉండదు, అజయ్ దేవగన్ మాత్రం ప్రస్తుతం నార్త్ లో ఉన్న ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకోని ‘హిందూయిజం’పై ఫోకస్ చేసినట్లు ఉన్నాడు. గతంలో వదిలిన ‘భోలా’ గ్లిమ్ప్స్ వీడియోలో కూడా అజయ్ దేవగన్ ‘త్రిశూలం’ పట్టుకోని ఫైట్ చేస్తున్నాడు. ఈ కారణంగానే ‘భోలా’ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ‘ఖైదీ’ సినిమాలాగా కాకుండా ‘అఖండ’ సినిమా గుర్తొస్తుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగన్ ‘భోలా’ సినిమాని 3Dలో చేస్తున్నాడు. ఫక్తు యాక్షన్ సినిమాని 3Dలో ఎందుకు చేస్తున్నాడో అజయ్ దేవగన్ కే తెలియాలి.
Ek Chattaan, Sau Shaitaan.
Iss kalyug mein aa raha hai #Bholaa, 30th March 2023.#Bholaain3D #Tabu pic.twitter.com/Lfp19n4xlF
— Ajay Devgn (@ajaydevgn) December 20, 2022