NTV Telugu Site icon

Ajay Devgn : కన్నడ స్టార్ కు కౌంటర్… లాంగ్వేజ్ వార్

Ajay Devgan

Ajay Devgan

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్ మాట్లాడుతూ ” బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాము” అని అన్నారు.  “కేజీఎఫ్ : చాప్టర్ 2” సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘హిందీ ఇకపై జాతీయ భాష కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలను విమర్శించిన వారు లేకపోలేదు. అయితే సుదీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ బాలీవుడ్ అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యాయి.

Read Also : Acharya : పవన్ కోసం స్పెషల్ షో… ప్లాన్ రివీల్ చేసిన చిరు

అజయ్ దేవగన్… సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. “సోదర కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన” అని ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కు దారి తీసే అవకాశం ఉంది. మరి అజయ్ ప్రశ్నకు సుదీప్ రియాక్షన్ ఎలా ఉంటుందో ? అజయ్ ట్వీట్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.