Ajay Devgn : కన్నడ స్టార్ కు కౌంటర్… లాంగ్వేజ్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్ మాట్లాడుతూ ” బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాము” అని అన్నారు. “కేజీఎఫ్ : చాప్టర్ 2” సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘హిందీ ఇకపై జాతీయ భాష కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలను విమర్శించిన వారు లేకపోలేదు. అయితే సుదీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ బాలీవుడ్ అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యాయి.
Read Also : Acharya : పవన్ కోసం స్పెషల్ షో… ప్లాన్ రివీల్ చేసిన చిరు
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
అజయ్ దేవగన్… సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. “సోదర కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన” అని ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కు దారి తీసే అవకాశం ఉంది. మరి అజయ్ ప్రశ్నకు సుదీప్ రియాక్షన్ ఎలా ఉంటుందో ? అజయ్ ట్వీట్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022
తాజావార్తలు
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!