ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించారు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలో రిలీజ్ అయ్యి, రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. ఇంటర్వెల్ నుంచి బాలయ్య ఆడిన రుద్రతాండవం చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. బాలయ్య సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ రాబడుతుందని కలలోనైన ఊహించారా? అది కూడా 20, 30 రూపాయల టికెట్ రేట్స్ తో… ఇంపాజిబుల్ కదా. ఆ ఇంపాజిబుల్ నే చేసి చూపించింది అఖండ.
ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాయి కానీ, ‘అఖండ’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యి ఉంటే అక్కడ బాలకృష్ణ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టే వాడు. అఖండ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్… బోయపాటి శ్రీను డైరెక్షన్, బాలయ్య టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, తమన్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ మూడు అంశాలు ‘అఖండ’ సినిమాని ఆడియన్స్ కి దెగ్గర చేశాయి. ఇదే సినిమాని ఇంకొకరు రీమేక్ చేయాలి అంటే అయ్యే పని కాదు, పైగా బాలయ్య చేసిన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ ని మాచ్ చేయడం అనేది అసలు అయ్యే పనే కాదు. బాలయ్య, ‘అఘోర’ క్యారెక్టర్ లో చూపించిన టెంపోని మాచ్ చేయడం ఎవరికైనా కష్టమే. ఈ విషయం తెలియక బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ‘అఖండ’ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లు ‘అఖండ’ సినిమాని బాలివుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని బీ-టౌన్ వర్గాల సమాచారం. హిందుత్వం పైన తెరకెక్కిన సినిమా కాబట్టి అక్కడి ఆడియన్స్ ‘అఖండ’ని చూసే ఛాన్స్ ఉంది కానీ… బాలయ్య ఇచ్చిన ఇంపాక్ట్ అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ ఇస్తారా? అంటే కష్టమనే చెప్పాలి. మరి ఈ టఫ్ టాస్క్ ని అజయ్ దేవగన్ లేదా అక్షయ్ కుమార్ ఎలా పుల్ ఆఫ్ చేస్తారు అనేది చూడాలి. ‘అఘోర’ పాత్రని చేసే హీరో, ఆ ఇంపాక్ట్ ఇవ్వలేకపోతే ‘అఖండ’ సినిమా ఫెయిల్ అవ్వడమే కాదు… తెలుగు ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది.