Site icon NTV Telugu

Ajay Devgan: హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు..?

ajay devagan

ajay devagan

ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందించాడు. మొదటి నుంచి పాన్ మసాలా యాడ్స్ కి అజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న  విషయం తెలిసిందే.

ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అజయ్  ఈ వివాదంపై  మాట్లాడుతూ ” నిజం చెప్పాలంటే ఈ వివాదంపై నేను మాట్లాడనుకోవడంలేదు.. ఎందుకంటే ప్రకటనలను ఎంపిక చేసుకోవడం స్టార్ల వ్యక్తిగత విషయం. వారు కావాలనుకుంటే చేస్తారు.. వద్దు అంటే మానేస్తారు. అయితే ఆ ప్రకటన చేసేటప్పు అది హానికరమా.. ? లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ లో హానికరమైన పదార్దాలు ఉండొచ్చు..? లేకపోవచ్చు.  కానీ.. దీనికన్నా ఎన్నో హానికరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే   వాటిని చెప్పి మళ్లీ  వాటి ప్రమోషన్స్ నేను చేయలేను. అస్సలు ప్రకటనలు నా దృష్టిలో పెద్ద విషయమే కాదు.. ఒకవేళ హానికరమైన ప్రొడక్ట్స్ అయితే వినియోగదారులు ఎందుకు విక్రయిస్తున్నారు.. ప్రజలకు ఎందుకు అమ్మాలి. హానికరమైన ఉత్పతులను ఎందుకు అమ్ముతున్నారు..? అది వారిని అడగాల్సిన  ప్రశ్న”  అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అజయ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version