Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. రెండు కుటుంబాలు వీరిద్దరూ కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. కానీ, వాటిలో ఎలాంటి నిజం లేదు. అలా అనుకుంటూనే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఎవరి కెరీర్ ను వారు బిల్డ్ చేసుకుంటున్నారు. ధనుష్ వరుస సినిమాలతో బిజీగా మారగా.. ఐశ్వర్య డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తుంది. ఇటీవలే తండ్రి నటించిన లాల్ సలామ్ కు దర్శకత్వం వహించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య.. తన విడాకుల తరువాత జీవితం గురించి నోరు విప్పింది.
ధనుష్ తో విడాకుల తరువాత మీ జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్నకు ఐశ్వర్య మాట్లాడుతూ.. “రెండేళ్లుగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సింగిల్ లైఫ్ ను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఈ రెండేళ్లలో నేను గమనించిన విషయం ఏంటంటే.. మనం ఒంటరిగా ఉన్నప్పుడే సేఫ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. పిల్లల కోసం గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చా.. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. ప్రపంచం ఎంతో ఫాస్ట్ గా పరిగెడుతోంది. నేను కూడా అందులో ఉండాలనుకుంటున్నాను. సింగిల్ లైఫ్ లో టైమ్ అస్సలు తెలియడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!