Aishwarya Rai : అలనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించలేదు. అయితే 78వ కేన్స్ ఫెస్టివల్స్ లో తాజాగా ఐశ్వర్య రాయ్ మెరిసింది. నుదిటిన సిందూరం పెట్టుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఆమె ఇలా సిందూరం పెట్టుకుని కనిపించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఆమె తాజాగా తన బరువుపై స్పందించింది.
Read Also : Spirit : ప్రభాస్ పక్కన క్రేజీ హీరోయిన్.. సందీప్ ప్రయత్నాలు..?
గతంలో పాప పుట్టిన తర్వాత ఐశ్వర్య రాయ్ బాగా బరువు పెరిగిపోయిందంటూ పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. కొన్ని సార్లు ఆమెపై బాడీ షేమింగ్, ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ వాటిపై ఎన్నడూ స్పందించలేదు ఐశ్వర్య. తాజాగా వాటన్నింటిపై ఘాటుగా రియాక్ట్ అయింది ఈ బ్యూటీ. ‘నేను అసలు బరువు పెరిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. నాకు కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా లేదా నీరు పట్టిందా అనేది మీకెందుకంత ఇంట్రెస్ట్. అది నేను చూసుకుంటా కదా. నా బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను హ్యాపీగా నా పాపను చూసుకుంటున్నాను. ఇప్పటి వరకు నా బరువు నాకు అసలు సమస్యనే కాదు. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోవచ్చు. కానీ నాకు ఆ అవసరం లేదు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎవరేం అనుకున్నా నాకు ఇబ్బంది లేదు’ అంటూ తెలిపింది ఐశ్వర్య.
Read Also : Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిన “అగ్నివీరులు”.. అంతా 20 ఏళ్ల లోపు వారే..
