బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్ బచ్చన్–అభిషేక్ బచ్చన్ న్యాయపోరాటానికి యూట్యూబ్ ఎట్టకేలకు దిగొచ్చింది. తమ అనుమతి లేకుండా AI డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ఫొటోలు, వీడియోలను యూట్యూబ్‌లో పబ్లిక్ చేసారని, వాటిని తొలగించాలని ఈ జంట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు వారిని సపోర్ట్ చేసినప్పటికీ, యూట్యూబ్ వెంటనే ఆ వీడియోలను తొలగించలేదు. దీని ఫలితంగా, ఐశ్వర్య–అభిషేక్ జంట యూట్యూబ్ మరియు దాని మాతృ సంస్థ గూగుల్ పై రూ.4 కోట్లకు పరువు నష్టం (Defamation / Damages) కేసు దాఖలు చేశారు. వెంటనే యూట్యూబ్ స్పందించింది. దాదాపు 250కి పైగా వీడియోల లింక్‌లను తొలగించి, ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసే ఛానల్స్‌ను కూడా బ్లాక్ చేసింది.
Also Read: Janhvi Kapoor: స్టార్ కిడ్స్‌కి కూడా కష్టాలు ఉంటాయి..
ఈ ఘటన, AI పెరుగుతున్న తరుణంలో సెలబ్రిటీలకు వ్యక్తిత్వ హక్కులు ఎంత ముఖ్యమో మళ్లీ చూపిస్తుంది. ఇలాంటి కంటెంట్ వాళ్ల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు యూట్యూబ్, గూగుల్ వంటి అన్ని ప్లాట్‌ఫార్మ్‌లకు 72 గంటల్లో వీడియోలను తొలగించమని కఠినంగా హెచ్చరించింది. ఇప్పటివరకు, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన పేరు, ఫోటోలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల్లో ఉపయోగించడం పై ఫిర్యాదు చేసి, కోర్టు ఉత్తర్వులు పొందారు. ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను కాపాడడం లో ఈ కేసులు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.