Site icon NTV Telugu

Aishwarya Lakshmi: గుడిలో వాడు నా ప్రైవేట్ భాగాలను తాకాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Ish

Ish

Aishwarya Lakshmi: కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడు ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఏడాదిలో వరుసగా 5 సినిమాలను రిలీజ్ చేసి హిట్లు అందుకుంది. పొన్నియిన్ సెల్వన్, అమ్ము, కుమారి, మట్టి కుస్తీ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక తాజాగా మట్టి కుస్తీ ప్రమోషన్స్ లో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకొంది. తాను కూడా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యినట్లు చెప్పుకొచ్చింది.

“నేను చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండేదాన్ని.. ఒకరోజు నా కుటుంబంతో కలిసి కేరళలోని గురువాయార్ ఆలయానికి వెళ్ళాం. అక్కడ ఒక యువకుడు నాతో దురుసుగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరోజు నేను పసుపు రంగు బట్టలు వేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఆ రంగు బట్టలు వేసుకోవాలంటే భయపడిపోతాను.కానీ, ఇప్పుడిప్పుడే ఆ భయం పోతుంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. గుడి అని కూడా చూడకుండా కామాంధుడు చేసిన పనికి ఎందుకు వదిలేశారు.. మీ తల్లిదండ్రులకు చెప్పి అతడిని చితకబాదాల్సింది అని కొందరు.. చిన్నపిల్లలను కూడా వీరు వదలడంలేదు జాగరత్తగా ఉండాలి అని మరికొందము కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version