I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ అయిన విషయం తెలిసందే కదా. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను నానా ఇబ్బందులు పెట్టాడు. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయాడు. సినిమా వాళ్లకు ఇది చాలా గుడ్ న్యూస్. కానీ సామాన్య జనాలు మాత్రం రవికి ఫుల్ మద్దతు ఇస్తున్నారు. అతని అరెస్ట్ ను ఖండిస్తున్నారు. పెద్ద నేరాలు చేసిన వాళ్లను విడిచిపెట్టి.. ఇతన్ని ఎందుకు పట్టుకున్నారంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదంటున్నారు. రవిని ఒక్కడిని పట్టుకోవడం వల్ల పైరసీ ఆగుతుందని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రవిని భార్య పట్టించిందనే న్యూస్ ముందు సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా.
Read Also : Prithviraj Sukumaran : పుష్పతో నా సినిమాను పోల్చకండి.. పృథ్వీరాజ్ కామెంట్స్
ఇంకేముంది ఆ న్యూస్ కు త్రివిక్రమ్ డైలాగులు ఆడ్ చేసి మీమ్స్ వేసేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో, నితిన్ హీరోగా వచ్చిన అఆ మూవీలో రావు రమేశ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా.. కూతుర్లు, చెల్లెళ్ల రూపంలో మన చుట్టూనే ఉంటారు అనేది. ఇందులో భార్య పేరు లేకపోయినా.. సిచ్యువేషన్ కు సింక్ అవుతుంది కాబట్టి ఈ డైలాగ్ తో రవి అరెస్ట్ పై మీమ్స్ వేస్తున్నారు. రవి భార్య వల్లే అరెస్ట్ అయ్యాడని.. భార్యే అతనికి పెద్ద శత్రువు అనే అర్థం వచ్చేలా మీమ్స్ వేస్తున్నారు. అంటే రవి అరెస్ట్ తో త్రివిక్రమ్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడన్నమాట. వాస్తవానికి భార్య వల్ల రవి అరెస్ట్ కాలేదని క్లియర్ అయిపోయినా.. ఇలాంటి మీమ్స్ ఆగట్లేదు.
Read Also : Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా