NTV Telugu Site icon

Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్

Prabhas

Prabhas

Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇక కరోనా తరువాత కూడా ఒక్కో కుర్ర హీరో అలా అలా బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేస్తున్నారు. కానీ, సింగిల్ కింగులం అనే బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి పట్టించుకోవడమే లేదు అనేది డార్లింగ్ ఫ్యాన్స్ మాట. సోషల్ మీడియాఓ ఒకానొక సమయంలో సింగిల్ కింగులం అని ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి అందులో పెళ్లికాని కుర్ర హీరోలందరిని పెట్టుకొచ్చి ఫన్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ కు అడ్మిన్ గా డార్లింగ్ ప్రభాస్ ను పెట్టారు. ఇక ఆ గ్రూప్ నుంచి పెళ్లి చేసుకొని ఒక్కో హీరో బయటికి వచ్చేస్తున్నాడు. రామ్ చరణ్ దగ్గరనుంచి ఈ మధ్యనే వివాహం చేసుకున్న నాగ శౌర్య వరకు సింగిల్ కింగులం గ్రూప్ నుంచి అభిమానులు బయటికి పంపించేశారు.

ఇక నేడు కుర్ర హీరో శర్వానంద్ కూడా ఆ గ్రూప్ నుంచి బయటికి వచ్చేశాడు. ప్రభాస్ తరువాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన శర్వా.. ప్రభాస్ కన్నా ముందే పెళ్లికి ఓకే చెప్పి షాక్ ఇచ్చాడు. నేడు ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో మనోడు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇక శర్వాకు శుభాకాంక్షలు తెలుపుతూనే గ్రూప్ అడ్మిన్ ప్రభాస్ పెళ్లిపై పడ్డారు ఫ్యాన్స్. శర్వాకు 38.. ఆయన కూడా పెళ్లి చేసేసుకున్నాడు. ఇక నువ్వెప్పుడూ పెళ్లి మాట చెప్తావ్ డార్లింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోపక్క అన్నా.. నిజం చెప్పు సల్మాన్ లా అయితే మారవు కదా అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ హీరో పెళ్లి అయినా మొదట ట్రోల్ చేసేది ప్రభాస్ నే.. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అవుతాడు అంటూ అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరి డార్లింగ్ ఈ ఏడాది అయినా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడా..? సింగిల్ కింగులం నుంచి డార్లింగ్ బయటపడతాడా..? అనేది చూడాలి.