Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. హిట్, మేజర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి 2 ని పాన్ ఇండియా రేంజ్ లో రెడీ చేస్తున్న శేష్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయడానికి అడివి శేష్ కమిట్ అయ్యాడని అంటున్నారు.
Salaar : అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్!
డెకాయిట్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా కథని డెవలప్ చేస్తున్నా, స్వయంగా ఆయనే ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఒకవేళ శశికిరణ్ స్టోరీ వరకే పరిమితమైతే అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే శేష్ ఈ సినిమా స్క్రీన్ ప్లే, మాటలు రెడీ చేసుకున్నాడు, కాబట్టి డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి అడవిశేష్ గతంలో డైరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కర్మ,కిస్ సినిమాలకు తనే దర్శకత్వం వహించగా మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే తన సినిమాలకి రైటర్ గా కొనసాగుతూనే హీరోగా చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై గ్రిప్ కూడా తెచ్చుకున్నాడు. అందుకే 10 ఏళ్ళ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా ఎంతవరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.
