Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సిబుల్ హీరో అడివి శేష్, గ్లామర్ క్వీన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధమైంది. 2 గంటల 30 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, మునుపెన్నడూ చూడని ఒక ఎమోషనల్ రైడ్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన నటనతో ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్టర్ పీస్‌గా నిలవబోతోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ఒక సున్నితమైన ప్రేమకథతో మొదలవుతుంది. క్రూరమైన ప్రపంచంలో, కుట్రల మధ్య నలిగిపోయే ఒక స్వచ్ఛమైన జంట ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఎడారి లాంటి కఠినమైన భూభాగాల్లో చిత్రీకరించిన ఎస్కేప్ సీన్లు విజువల్ వండర్‌గా నిలుస్తాయి. భోజ్ పురి స్టార్ పవన్ సింగ్, జొనిత గాంధీ మరియు భీమ్స్ సిసిరోలియోల ఎంట్రీలు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం. అడివి శేష్-మృణాల్ మధ్య కెమిస్ట్రీ పీక్స్‌లో ఉండగా, ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. ముఖ్యంగా ‘స్వామి’ పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని అంటున్నారు.
Also Read :Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
సెకండాఫ్ పూర్తిగా వేగం పుంజుకుంటుంది. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని కార్ ఛేజింగ్‌లు, స్టంట్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెలను పిండేసే ఎమోషన్స్ ఈ సినిమా ప్రాణం. ఊహించని మలుపులు, రహస్యాలు బయటపడే కొద్దీ ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేయగా, వరల్డ్ క్లాస్ స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. ఒక పక్క కమర్షియల్ హంగులు, మరోపక్క మనసును హత్తుకునే గాధ.. ఇదీ ‘డెకాయిట్’ ప్రత్యేకత. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా చూశామనే తృప్తితో పాటు, ఒక మరుపురాని ప్రేమకథను వెంట తీసుకెళ్తారు. అడివి శేష్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద టీం అయితే మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని చెప్పుకుంటోంది మరి అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!