Site icon NTV Telugu

Hit 2: కిల్లర్ ఎవరు.. దండం పెట్టి చెప్పిన అడివి శేష్

Sesh

Sesh

Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో అడివి శేష్, నాని సైతం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇప్పటివరకు సినిమాలో విలన్ ఎవరు.. ఆ కిల్లర్ ఎవరు అనేదాన్ని బయటపెట్టకుండా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. ఇక తాజాగా కిల్లర్ ఎవరు అనేది చెప్తాను అని శేష్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కాగా కిల్లర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆ వీడియోను క్లిక్ చేయగా శేష్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.

“కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో క్లిక్ చేశారు. కానీ ఒక చిన్న ట్రిక్ ఇది. రేపు సినిమా చూసాకా.. కిల్లర్ ఎవరు..? ట్విస్ట్ ఏంటి..? ఇలాంటివి స్పాయిలర్ చేయకండి. ఎందుకంటే. మేము రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మీరు రెండు నిమిషాల సరదా కోసం దయచేసి కిల్లర్ ఎవరు..? ట్విస్ట్ ఏంటి..? ఎక్కడ వస్తుంది..? ఇలాంటివి రివీల్ చేయకండి. మీకు తెలుసు నేను సినిమా చూపించడానికి భయపడను. మేజర్ సినిమాను రెండు వారాల ముందే చూపించాను. కానీ, ఈ సినిమా అలా కాదు. అందరు థియేటర్ లోనే చూడాలి. ఇప్పటివరకు ఎవరికి ఈ సినిమా చూపించలేదు. దయచేసి ధ్రిల్ ను పాడుచేయకండి ప్లీజ్.. హిట్ 2 .. డిసెంబర్ 2 న థియేటర్ లో చూడండి”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version