Site icon NTV Telugu

Adivi Sesh: ఓవర్సీస్ లో ‘హిట్ 2’ కొత్త బెంచ్ మార్క్…

Hit 2 Movie Review

Hit 2 Movie Review

డబుల్ బ్లాస్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా రిలీజ్ అయిన ‘హిట్ 2’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ‘హిట్ 2’ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసిన ‘హిట్ 2’ మూవీ సెకండ్ వీక్ లో కూడా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. డిసెంబర్ 9న పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘హిట్ 2’కి కలిసొచ్చే విషయం. డిసెంబర్ 16న ‘అవతార్ 2’ రిలీజ్ అయ్యే వరకూ అడివి శేష్ సినిమా స్పీడ్ బ్రేక్ వేయడం కష్టమే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ‘హిట్ 2’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది.

‘హిట్ 2’ మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ టచ్ చేయడానికి దగ్గరలో ఉంది. అడివి శేష్ కి ఉన్న క్రెడిబిలిటీ, ‘హిట్ 2’ క్లైమాక్స్ లో నాని కనిపించడం ఈ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టడానికి కారణం అయ్యాయి. ఓవరాల్ రన్ లో ‘హిట్ 2’ మూవీ 1.5 మిలియన్ మార్క్ వరకూ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే ‘హిట్ 2’ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టినట్లే. ‘హిట్ 2’ మంచి కలెక్షన్స్ ని రాబట్టడం, ‘హిట్ 3’ కలిసొచ్చే విషయమే. నాని మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న మూవీకి హిట్ టాక్ వస్తే చాలు ‘హిట్ 3’ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.

Exit mobile version