థ్రిల్లర్ జోనర్ ప్రేమికులని ఫుల్ లెంగ్త్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా ‘హిట్ 2’. అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన సెకండ్ మూవీగా ‘హిట్ 2’ రిలీజ్ కి ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టి అడివి శేష్ ఖాతాలో మరో హిట్ గా నిలిచింది ‘హిట్ 2’ సినిమా. డిసెంబర్ 16న అవతార్ 2 రిలీజ్ అయ్యే వరకూ మంచి కలెక్షన్స్ ని రాబట్టిన ‘హిట్ 2’ మూవీ ఓవరాల్ గా 31 కోట్లని రాబట్టింది. ఆ తర్వాత అవతార్ 2, ధమాకా సినిమాల హవా మొదలవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర ‘హిట్ 2’ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇటివలే ‘హిట్ 2’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యింది కానీ బాలీవుడ్ లో ఈ సినిమా పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. బాలీవుడ్ లో హిట్ 2 సినిమా రిలీజ్ అయ్యి వారం కూడా కాకుండానే, ఈ మూవీ ఒటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అయ్యింది. జనవరి 6 నుంచి హిట్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది. అయితే ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో హిట్ 2 మూవీ హిందీలో కూడా అవైబుల్ గా ఉంటుందా లేక తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
గతంలో తెలుగు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సీతారామం సినిమాని కూడా లేట్ గా హిందీలో రిలీజ్ చేశారు. ఈ లోపే సీతారామం ఒటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. హిందీ స్ట్రీమింగ్ ని మాత్రం హోల్డ్ చేసి మిగిలిన భాషల్లో సీతారామం సినిమాని ఒటీటీలో విడుదల చేశారు. ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అయిన కార్తికేయ 2 సినిమాని కూడా కేరళలో లేట్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అవుతున్న సమయంలో మలయాళ వెర్షన్ ని మాత్రమే ఆపేసి ఇతర భాషల్లో స్ట్రీమింగ్ చేశారు. ప్రస్తుతం హిట్ 2 కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి ఒటీటీలోకి సబ్ టైటిల్స్ తో సహా వచ్చేసాక ఆ ఒక్క భాషలో సినిమాని రిలీజ్ చేసినా చెయ్యకపోయినా పెద్దగా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ లేదనే విషయాన్ని మేకర్స్ మర్చిపోతున్నారు. ఒకవేళ మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ కి వెళ్లాలి అనుకుంటే అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యాలి కాదని లేట్ చేస్తే ఇలానే ఒక భాషలో థియేటర్స్ లో ఆడుతూ ఉండగానే ఇంకో భాషలో ఒటీటీలో విడుదల చెయ్యాల్సి వస్తుంది.