NTV Telugu Site icon

Matka: దుమ్మురేపిన మట్కా.. రికార్డు ధరకు ఆడియో రైట్స్

Matka

Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రం మట్కా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇది అనేక సంచలనాలు సృష్టిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను 3.6 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ సినిమాల మ్యూజికల్ రైట్స్‌లో ఇదే అతిపెద్ద డీల్ అని చెప్పొచ్చు. చిత్రనిర్మాతలు సౌండ్‌ట్రాక్ కథలోని పాతకాలపు వాతావరణాన్ని ప్రామాణికంగా ప్రతిబింబించేలా డిజైన్ చేశారు.

Also Read: Mahesh Babu: రంగంలోకి మహేష్.. వరద బాధితుల కోసం కోటి విరాళం

GV ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు కూడా ఒక రేంజ్ లో వచ్చాయని తెలుస్తోంది. వరుణ్ తేజ్ తన కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకదానిని ఈ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా 1958 నుండి 1982 వరకు 24-సంవత్సరాల కాలం మధ్యలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. శ్రద్ధతో విభిన్నంగా ఉంది. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments