Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ ఒకసారి ముంబైలో హోటల్ కు వెళ్లాం. అక్కడ మహేశ్ బాబు ఉన్నారు. ఆయనతో సెల్ఫీ దిగడానికి నేను, మా సిస్టర్ వెళ్లాం.
Read Also : Ration Rice Distribution: ‘రేషన్’వార్.. కూటమి వర్సెస్ వైసీపీ..!
కానీ ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పారు. మేం వెనక్కు వచ్చేసిన తర్వాత ఆయన బాడీ గార్డు మహేశ్ వద్దకు వెళ్లి మేం శంకర్ గారి కూతుర్లం అని చెప్పారు. దాంతో మహేశ్ మా వద్దకు వచ్చి మా డాడీతో మాట్లాడారు. మీ కూతుర్లు అని తెలియక రిజెక్ట్ చేశానని చెప్పి మాతో సెల్ఫీ దిగారు’ అని అదితి చెప్పుకొచ్చింది.
అయితే ఇందులో మహేశ్ బాబు వద్దకు వెళ్లి చెప్పింది బాడీగార్డు కాదు డైరెక్టర్ మెహర్ రమేశ్. గతంలో ఇదే ఇన్సిడెంట్ గురించి మహేశ్ బాబు అన్ స్టాపబుల్ షోలో చెప్పారు. శంకర్ కూతుర్లు అని తెలియక రిజెక్ట్ చేశానని.. మెహర్ రమేశ్ వచ్చి వాళ్లు శంకర్ కూతుర్లు అని చెప్పడంతో వెళ్లి సెల్ఫీ ఇచ్చినట్టు వివరించాడు. అంటే మెహర్ రమేశ్ ను అదితి శంకర్ బాడీగార్డు అనుకుందేమో. ఆమె వీడియో చూసిన నెటిజన్లు మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిందేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె తెలియక అనేసిందేమో లే అంటూ ఇంకొందరు కవర్ చేసేస్తున్నారు.
Read Also : Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..
