ప్రభాస్.. ఈ మూడు అక్షరాలే ఇప్పుడు మూడు వేల కోట్లు. ఈ పాన్ ఇండియా కటౌట్‌పై కోట్ల కర్చుపెడుతున్నారు మేకర్స్. ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ మరే ఇండియన్ హీరోకి లేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు ఇండియా మొత్తం జరుపుకునే ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. థియేటర్ల ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ప్రభాస్‌కే సొంతం. అసలు తెలుగులో కంటే హిందీలో ప్రభాస్ క్రేజ్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అందుకు నిదర్శనమే ఆదిపురుష్ ట్రైలర్. ఈ సినిమా పై ఉన్న నెగెటివిటీ మొత్తాన్ని తుఫాన్‌లా తుడిచిపెట్టేసింది ట్రైలర్. అన్ని భాషల్లో కలిపి 24గంటల్లో 70 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క బాలీవుడ్‌లోనే 52 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన ట్రైలర్స్ లో ఆదిపురుష్ ట్రైలర్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
బాలీవుడ్‌లో టాప్ హీరోలను మించి ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేయడం సంచలనంగా మారింది. ఈ లెక్కన బాలీవుడ్‌లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే హిందీ ట్రైలర్‌కు ఫాస్టెస్ట్ 100కే లైక్స్ దక్కాయి. రిలీజ్ అయిన 10 నిమిషాల్లోనే అన్నీ భాషల్లో కలిపి మిలియన్‌కు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది ఆదిపురుష్ ట్రైలర్. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వ్యూడ్ వీడియోగా ఒక్క రోజులోనే రికార్డులను తిరగరాసింది ఆదిపురుష్. డిజిటల్ రికార్డులనే కాదు బాక్సాఫీస్ రికార్డులు కూడా క్రియేట్ చేసేందుకు ఆదిపురుష్ సినిమా రెడీ అవుతోంది. ఒక్క ట్రైలర్‌కే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయిన రోజు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పాటు బాక్సాఫీస్ ని కూడా కబ్జా చేయడం పక్కా. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
