NTV Telugu Site icon

Adipurush: అప్పుడే ఓటిటీలోకి ఆదిపురుష్.. ?

Prabhas

Prabhas

Adipurush: ఏంటీ .. ఆదిపురుష్ అప్పుడే ఓటిటీలోకి వస్తుందా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గత నెల 16 న విడుదలైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం కలక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇక వివాదాలతో ఇప్పటికి.. కోర్టులు, కేసులు అంటూ కొనసాగతున్న ఆదిపురుష్ ఓటిటీలోకి ముందే వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మూడు వారాల తరువాత సినిమాలు ఓటిటీలో అడుగుపెడతాయి. అయితే ముందుగానే ఆదిపురుష్ రెండు నెలలవరకు ఓటిటీకి రాదు అని అనుకున్నారు. రాముడి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్ లోనే చూస్తారని అభిప్రాయపడ్డారు. కానీ, ఇక్కడ చూస్తుంటే.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. టికెట్ రేట్స్ తగ్గించినా కూడా ఆదిపురుష్ ను థియేటర్ లో చూడడానికి సాహసం చేయడం లేదు అభిమానులు. అందుకు కారణాలు ఏవైనా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ప్రతిఒక్కరు ఆదిపురుష్ ఓటిటీకోసం ఎదురుచూస్తున్నారు.

Kiraak RP: వాళ్లు బాలకృష్ణ మనుషులు.. రోజూ నా కర్రీ పాయింట్ కి వచ్చి

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కు సమానంగా రైట్స్ ఇద్దామనుకున్నా.. నెట్ ఫ్లిక్స్ మాత్రం మొత్తం తమకే కావాలని దాదాపు రూ. 250 కోట్లకు దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం అన్ని భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ కానున్నాయి. ఇక ముందు అనుకున్నట్టుగానే రెండు నెలల తరువాతే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇందులో ఏది నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు. త్వరలో ఏమైనా నెట్ ఫ్లిక్స్ ఇందుకు సంబంధించిన ప్రకటన రిలీజ్ చేస్తుందేమో చూడాలి.

Show comments