NTV Telugu Site icon

ముంబైలోనే ‘ఆదిపురుష్’ నెక్ట్స్ షెడ్యూల్!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేష‌న్ లో త్రీడీ చిత్రం ఆదిపురుష్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుండే ఆ ప్రాజెక్ట్ కు సూప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మాత భూష‌ణ్ కుమార్ తెర‌కెక్కించ‌డానికి ప‌థ‌క ర‌చ‌న చేశారు. క‌రోనా సెకండ్ వేవ్ కు కాస్తంత ముందుగా ముంబైలో షూటింగ్ మొద‌లైనా, ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షెడ్యూల్ కు మ‌ధ్య‌లో బ్రేక్ ప‌డింది. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆదిపురుష్ షూటింగ్ ను హైద‌రాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నార‌నే వార్త‌లూ ఆ మ‌ధ్య వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నెల ద్వితీయార్థం ప్రారంభంలోనే ముంబైలో ఆదిపురుష్ తాజా షెడ్యూల్ మొద‌లెట్టాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ప‌లు చిత్రాల రెగ్యుల‌ర్ షూటింగ్స్ మొద‌ల‌య్యాయి. ఆ క్ర‌మంలోనే ఆదిపురుష్ను మొద‌లు పెడ‌తార‌ని, హైద‌రాబాద్ కంటే ఓ ర‌కంగా ముంబైలోనే వాక్సినేష‌న్ కార్య‌క్రమం వేగంగా సాగుతోంద‌ని, అదే సేఫ్ ప్లేస్ గా చిత్ర యూనిట్ భావిస్తోంద‌ని అంటున్నారు. అయితే…. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన ఇంకా రావాల్సి ఉంది.