Adipurush Makers Planning Another Big Surprise: ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతీ ప్రేక్షకుడి దృష్టి ఆదిపురుష్ సినిమా మీదే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేటర్లలో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అందరూ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. మొదట్లో టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాపై ఎంత నెగెటివిటీ వచ్చిందో, ట్రైలర్ వచ్చాక అంతే పాజిటివిటీ వచ్చిపడింది. చాలా గ్రాండియర్‌గా, మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌తో ట్రైలర్‌ని తీర్చిదిద్దడంతో.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత విడుదల చేసిన పాటలు వినసొంపుగా ఉండటం, అందులోని విజువల్స్ కూడా ఆకట్టుకోవడంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Priyank Kharge: ప్రియాంక్ ఖర్గేకు కీలక ఐటీ శాఖ కేటాయింపు.. ఎంబీ పాటిల్‌కు ఆ శాఖ!
ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్‌కి మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరో ట్రైలర్‌ని విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగానో లేక రిలీజ్‌కి కొన్ని రోజులు ముందుగానో ఈ ట్రైలర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదివరకే రిలీజైన ట్రైలర్‌లో ఎక్కువగా సబ్జెక్ట్ మీదే ఫోకస్ పెట్టడంతో, ఈసారి రిలీజ్ చేయబోయే ట్రైలర్‌లో యాక్షన్ పార్ట్‌ని హైలైట్ చేస్తూ చూపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల్ని మరింతగా ఆకర్షించేందుకే ఈ రెండో ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి.. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతోందో? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి.
Lady constable: ప్రయాణికురాలు ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్..
కాగా.. ప్రభాజ్, కృతిసనన్ జంటగా నటించిన ఈ సినిమాను ఓమ్ రౌత్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల దృష్ట్యా.. తొలిరోజే ఇది రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతోందని, తొలి వారాంతం ముగిసే సమయానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అదే నిజమైతే.. గత రికార్డులన్నీ పటాపంచలు అయినట్టే!
