Site icon NTV Telugu

Adipurush: ఓవర్సీస్ లో డాలర్ల వర్షం…

Adipurush

Adipurush

దాదాపు 550 కోట్ల బ‌డ్జెట్‌లో లైవ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో.. ఆదిపురుష్‌ సినిమాను విజువల్ వండర్‌గా తెర‌కెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్‌ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్‌ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్‌ను రాయబోతోంది ఆదిపురుష్‌. ఇండియా వైడ్‌గా ఆదిపురుష్‌ హవా ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఓవర్సీస్‌లోను ఆదిపురుష్‌ దుమ్ముదులుపుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 1 మిలియన్ మార్క్‌ టచ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అమెరికాలో భారీగా బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు 800K డాలర్స్ మార్క్‌ క్రాస్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో తొలి రోజు ప్రివ్యూస్‌తో వన్‌ మిలియన్‌ డాలర్లను కొల్లగొట్టిన చిత్రాలు తక్కువ. ఈ లిస్టులో ఆదిపురుష్‌ చేరిందా? లేదా? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఆదిపురుష్ అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే 1 మిలియన్ మార్క్‌ని టచ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు 1 మిలియన్ డాలర్స్‌ క్లబ్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆదిపురుష్‌ కూడా ఆ లిస్ట్‌లోకి చేరిపోనుందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఇకపై ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ రీచ్ అయ్యేలా ఉంది.

Exit mobile version