Site icon NTV Telugu

Adipurush : శ్రీరామనవమి స్పెషల్… ప్రభాస్ ఫ్యాన్స్ కు తప్పని నిరాశ !

Adipurush

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్‌ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ రాముడిగా ప్రభాస్, జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా సినిమాలో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాళ్లకు నిరాశ తప్పలేదు.

Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్

డైరెక్టర్ ఓం రౌత్ ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో ఉన్న ఒక వీడియోను షేర్ చేస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ లుక్ అయినా విడుదల అవుతుందేమో అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల ఆశలను ఆవిరి చేస్తూ సినిమాతో సంబంధంలేని ఒక వీడియోతో సరిపెట్టేశారు దర్శకుడు. దీంతో శ్రీరాముడిపై సినిమా చేస్తూ శ్రీరామ నవమి రోజున ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కాగా “ఆదిపురుష్‌”ను భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక “ఆదిపురుష్”ను వరల్డ్‌వైడ్ గా 3డిలో 2023 జనవరి 12న విడుదల చేయనున్నారు.

Exit mobile version