Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు విశాల్ కు ఆ విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి హిట్ కోసం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాడని తెలుస్తుంది. విశాల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విశాల్, ఎస్ జె సూర్య కాంబో అనగానే హైప్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా కోసం విశాల్ మరో కొత్త అవతారంలో కనిపించాడు.
Women Harassment: టాలీవుడ్ లేడీ డైరెక్టర్ ను వేధించిన పోకిరి.. పార్క్ లో వాటిని చూపిస్తూ..
మొట్టమొదటిసారి మార్క్ ఆంటోని కోసం విశాల్ సింగర్ గా మారాడు. అది కూడా తెలుగులో పాడి ఆశ్చర్యపరిచాడు. నిజం చెప్పాలంటే విశాల్ తెలుగు వాడే కానీ కోలీవుడ్లో సెటిల్ అయ్యేసరికి అందరూ విశాల్ ను స్టార్ హీరోగా గుర్తిస్తారు. ఇక తాజాగా విశాల్ పాడిన పాట మేకింగ్ వీడియో ని మేకర్స్ రిలీజ్ చేశారు. అదరదా అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ పాటను తమిళ్ లో శింబు తండ్రి టి. రాజేందర్ చేత పాడించారు. ప్రతి భాషలో ఒక సెలబ్రిటీతో ఈ సాంగ్ ను పాడించనున్నారు. ఇక తెలుగులో వేరే సెలబ్రిటీ చేత పాడించాలని అనుకున్నారని, కానీ, విశాల్ అయితే మరింత ఇంపాక్ట్ ఉంటుందని డైరెక్టర్ .. విశాల్ తో ఈ సాంగ్ ను పాడించినట్లు తెలిసింది. ఆంటోనీ అనే పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఈ సాంగ్ లో చూపించనున్నారని తెల్సుతుంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
