Site icon NTV Telugu

Sanghavi: ఒకప్పుడు బికినీతో కుర్రకారును రెచ్చగొట్టిన సంఘవి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది

Sanghavi

Sanghavi

Sanghavi: టాలీవుడ్ సీనియర్ నటి సంఘవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. అప్పట్లో గ్లామర్ క్వీన్స్ లో సంఘవి కూడా ఒకరు. అందాల ఆరబోత.. బికినీ లో కూడా సంఘవి కనిపించి కుర్రకారును పిచ్చెక్కించింది. అమరావతి అనే తమిళ్ సినిమ ద్వారా వెండితెరకు పరిచయామైన ఈ భామ తెలుగులో సింధూరం సినీమాతో మంచి గుర్తింపును అందుకుంది. సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీమ సింహం, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఐటీ ప్రొఫెషనల్ ఎన్.వెంకటేష్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. ఈ జంటకు ఒక పాప.

Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా

ఇక పెళ్లి తరువాత మీడియాకు దూరంగా ఉన్న సంఘవి తాజాగా తిరుమలలో సందడి చేసింది. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సంఘవి తన భర్త వెంకటేష్, కూతురుతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఇక సంఘవిని చూసి గుర్తుపట్టిన వారు ఆమెతో సెల్ఫీలు దిగారు. అయితే సంఘవి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పెళ్లి తరువాత ఆమె చాలా బరువు పెరిగింది. అంతకు ముందు ఉన్న కళ ఫేస్ లో లేదు. దీంతో ఆమెను చూడగానే ఏంటీ .. ఒకప్పుడు బికినీతో కుర్రకారును రెచ్చగొట్టిన సంఘవి ఈమెనేనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సంఘవి బయట కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమనులకు దగ్గరగా ఉంటుంది.

Exit mobile version