NTV Telugu Site icon

Sai Pallavi: అదేం వింత అలవాటు పాప.. దాన్ని తినడమేంటి ..?

Sai

Sai

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ భామ శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె సినిమాలు చేయడం మానేసిందని, హాస్పిటల్ పెడుతుందని.. పెళ్లి చేసుకుంటుందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఇవేమి నిజం కాదని సాయి పల్లవి తేల్చి చెప్పేసింది. మంచి కథలను ఎంచుకోవడానికి టైమ్ పడుతుంది అని ఆమె తెలిపింది. మొదటినుంచి కూడా సాయి పల్లవి పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఒప్పుకుంటూ వస్తుంది. గ్లామర్ పాత్రలను కానీ, కేవలం సాంగ్స్ కు పరిమితమయ్యే సినిమాలను కానీ ఒప్పుకోకుండా తనకు గుర్తింపు తెచ్చే పాత్రలను చేస్తూ మెప్పిస్తుంది. ఇక అప్పుడప్పుడు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఇటీవలే సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్ గురించి, భవిష్యత్ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకున్న ఒక వింత అలవాటును కూడా తెలిపింది. సాయి పల్లవికి చిన్నతనం నుంచి విభూది తినడం అలవాటని తెలిపింది.

Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!

” చిన్నతనం నుంచి నాకు విభూది తినడం ఇష్టం. ఇప్పటికి తింటాను. ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు విభూదిని కూడా తీసుకెళ్తాను. నా బ్యాగ్ లో ఎప్పుడు విభూది ఉంటుంది. ఒక మంచి చెట్టు నుంచి వచ్చిన విభూది తినడం ఆరోగ్యానికి మంచిది” అని తెలిపింది. సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు, స్వామిజీలను కలిసినప్పుడు విభూదిని తినమని చెప్తూ ఉంటారు. కానీ, సాయి పల్లవి మాత్రం ఇలా నిత్యం విభూదిని తినడం వింతగా ఉందే అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అదేం వింత అలవాటు పాప అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సాయి పల్లవి త్వరలో తెలుగు సినిమా ఏదైనా ఒప్పుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.