Site icon NTV Telugu

Mission Majnu: రష్మిక నటించిన హిందీ సినిమా టీజర్ వచ్చేసింది…

Mission Majnu

Mission Majnu

నేషనల్ క్రష్ రష్మిక సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక, నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ మూవీ ‘స్పై యాక్షన్ థ్రిల్లర్’ మూవీ జనవరి 20న డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. థియేటర్ రిలీజ్ ని స్కిప్ చేస్తున్న ‘మిషన్ మజ్ను’ సినిమా టీజర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది, విజువల్స్ లో కూడా స్పై థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన గ్రాండియర్నెస్ ఉంది.

Read Also: Rashmika Vijay Deverakonda: మీకు అర్ధం అవుతుందా?

ఇండియా పాకిస్తాన్ మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో ‘మిషన్ మజ్ను’ సినిమా తెరకెక్కింది. శాంతను భగ్చీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే రష్మిక కెరీర్ కి మంచి బూస్ట్ లభించే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒటీటీలో ‘మిషన్ మజ్ను’ని ఆడియన్స్ విపరీతంగా చూడాలి, వాళ్లకి రష్మిక క్యారెక్టర్ నచ్చాలి… అప్పుడు కానీ నేషనల్ క్రష్ హిందీ కెరీర్ స్పీడ్ అందుకోదు. పొరపాటున ‘మిషన్ మజ్ను’ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వస్తే మాత్రం రష్మిక ఇక సౌత్ లో మాత్రమే సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది. మరి ‘మిషన్ మజ్ను’ రష్మిక బాలీవుడ్ కెరీర్ ని టర్న్ చేస్తుందా లేక మరింత ట్రబుల్ లోకి నెడుతుందా? అనేది చూడాలి. ఇప్పటివరకైతే టీజర్ తో ‘మిషన్ మజ్ను’ చిత్ర యూనిట్ ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ మిషన్ మజ్ను సాంగ్ లాంచ్ ఈవెంట్ లోనే రష్మిక, సౌత్ సినిమాల్లోని పాటల్లో మాస్ మసాలా ఎక్కువగా ఉంటుంది. నార్త్ సాంగ్స్ లో రోమాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటూ మాట్లాడింది. రష్మిక మాటలు వైరల్ అవ్వడంతో, ‘ఏ ఇండస్ట్రీకి వెళ్తే ఆ ఇండస్ట్రీని పొగడడమే పనిగా పెట్టుకున్నావ్. బాలీవుడ్ అంటే ఇష్టం అయితే అక్కడే ఉండిపో, సౌత్ సినిమాలే నిన్ను స్టార్ ని చేశాయి, నువ్వు నటించిన సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ లేవా?’ అంటూ నెటిజన్స్ రష్మికపై విరుచుకుపడ్డారు.

Exit mobile version