Prema: అందం, అభినయం, గౌరవం, వినయం, విధేయత .. ఇలా అన్ని లక్షణాలు ఉన్న హీరోయిన్ సౌందర్య. సావిత్రి తరువాత అంతటి గొప్ప గుర్తింపును అందుకున్న నటి సౌందర్య. హీరోయిన్ అంటే.. ఎక్స్ పోజింగ్ చేయాలి, అందాలు ఆరబోస్తేనే హిట్లు దక్కుతాయి అనుకొనే వారందరికీ ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయకుండా కేవలం ట్యాలెంట్ తోనే హిట్స్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో మంచి సినిమాల్లో నటించి, మెప్పించిన ఆ సౌందర్య రూపం ఇప్పుడు లేదు. కానీ, ఆమె గురించి ఇప్పుటికీ మాట్లాడుకుంటున్నారు అంటే.. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004 ఏప్రిల్ లో ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం హెలీకాఫ్టర్ లో బయల్దేరిన సౌందర్య మళ్లీ భూమి మీదకు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ సమయంలో ఆమె గర్భవతి అని కూడా పుకార్లు వచ్చాయి. ఆమె మృతితో ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోయింది. ఆమె పార్దీవ దేహాన్ని చూడడానికి అభిమానులు తరలివచ్చారు. అయితే ఆ ప్రమాదంలో సౌందర్య తల, మొండెం వేరు అయ్యాయని వార్తలు వచ్చాయి కానీ, నిజమో కాదో తెలియదు. అయితే అది నిజమేనని, తల లేని సౌందర్య బాడీని వాచ్ చూసి గుర్తుపట్టామని, ఆమె స్నేహితురాలు, నటి ప్రేమ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Samantha: సామ్.. అనవసరంగా ఈ రిస్క్ తీసుకుందా..?
“సౌందర్య చనిపోయిన రోజు.. ఆమెను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటి ఎదురుగా ఇద్దరు ఫోటోలు పెట్టి ఉన్నాయి. సౌందర్య, అతని అన్నయ్య ది. తన ఇంటికి వెళ్లినప్పుడు పార్థీవ దేహాన్ని ఒక బాక్స్ లో పెట్టారు. ఫేస్ లేదు. మొండెం మాత్రమే ఉంది. తట్టుకోలేకపోయా.. ఇంతేనా జీవితం అనిపించింది. సౌందర్య అమ్మగారిని చూసి చలించిపోయాను. ఒక ఆర్టిస్ట్ జీవితం ఇంతేనా.. ఏం తీసుకెళుతున్నాం. చనిపోయినప్పుడు మనకున్న పొజిషన్ ను, స్టార్ లైఫ్ ను ఏది తీసుకెళ్లం.. కేవలం గౌరవం, కర్మను మాత్రం మోసుకెళతాం. అక్కడ ఉన్నప్పుడు నాతో చాలామంది చెప్పారు. ముఖం గుర్తుపట్టడానికి తల కూడా లేదు.. ఆమె చేతికి ఉన్న వాచ్ చూసి గుర్తుపట్టామని.. ఆ సమయంలో ఆమె అమ్మగారితో మాట్లాడే దైర్యం చేయలేకపోయాను. బయటకి వచ్చేటప్పుడు సౌందర్య ఫోటో చూసి.. ఇంత అందమైన అమ్మాయి చనిపోయిందా..? అని నమ్మలేకపోయాను. ఆ ఫేస్ ఇప్పటికి నాకు గుర్తుంది. నేను సౌందర్య.. మంచి సినిమాలు చేశాం. ఇద్దరం కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకొనేవాళ్లం. కనీసం 10 నిముషాలు అయినా స్పెండ్ చేసేదాన్ని.. పంచవీటి గెస్ట్ హౌస్ లోనే సౌందర్య ఎప్పుడు ఉండేది. అక్కడికే వెళ్లి నేను కలిసేదాన్ని” అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.