Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actress Prashanthi Harathi Interview

Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..

Published Date :March 26, 2024 , 6:02 pm
By Bhargav Chaganti
Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Actress Prashanthi Harathi Interview: పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించడంతో నటిగా ఆమె కెరీర్ కి సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని తాజా ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి చెప్పారు. మీడియాతో ముచ్చటించిన ఆమె అనేక విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు

– మేము విశాఖలో ఉండేవాళ్లం, చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నా, మా ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాతావరణం ఉండేది. సినిమాలు చూసేందుకు నన్ను పంపే వారు కాదు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశా, ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామని సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యా. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టా, ఆ తర్వాత మణిశర్మ నిర్మించిన రూపాయి అనే చిత్రంలో నటించా. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చి ముంబై వెళ్లా. ఆ తర్వాత ఇంద్ర సినిమా కోసం అడిగితే ఆ సినిమాలో నటించా, అలా నా కెరీర్ కొనసాగింది.

Also Read

  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
  • Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్‌ స్టార్స్‌.. ఇక్కడ టాప్‌ పొజిషన్‌.. హిందీలో ఫ్లాపులు
  • Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
  • Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్

– పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లా, అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించా. నా కోసం అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చా, అక్కడి పిల్లలకు తెలుగు తెలియదు. క్లాసికల్ డ్యాన్స్ పాటల్లోని అర్థాలను ఇంగ్లీష్ లో వివరించి చెప్పేవాళ్లం. అప్పుడు వారికి అర్థమై నేర్చుకునేవారు. మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. మా పాప తాన్యతో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ రూపొందించారు. తెలుగింటి సంస్కృతికి మంచి రెస్పాన్స్ దక్కడం సంతోషాన్ని కలిగించింది. మా పాప తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు, తన ఏజ్ కు తగిన అవకాశం వస్తే పాప తాన్యను కూడా సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు అభ్యంతరం లేదు.

– నేను యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలే, అయితే క్లాసికల్ డ్యాన్సర్ ను కాబట్టి నటిగా తెలియకుండానే పరిణితి ఏర్పడింది. నవ్వడం, ఏడ్వడం వంటి భావోద్వేగాలు ఇలా చెబితే అలా చేసేవాళ్లం. దానికి ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండేది. ఈ ఆత్మవిశ్వాసంతో సినిమాలు, సీరియల్స్ చేశాను. అప్పట్లో మీడియా ప్రభావం అంత ఉండేది కాదు. చేస్తే సినిమాలు లేకుంటే సీరియల్స్. ఓటీటీ లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ తో ఔత్సాహిక నటీనటులకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్ కి రావాలి అనిపించింది. నటిగా నాకున్న ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నాను.

– మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి. ఎంత అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రలో నటించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్యారెక్టర్, ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది.

– ఒకప్పటితో చూస్తే మూవీ కంటెంట్ లో చాలా కొత్తదనం వచ్చింది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇన్నోవేటివ్ గా ఉంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు పెరిగాయి. మహానటి లాంటి గొప్ప బయోపిక్ లు వచ్చాయి. మేము ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూసి మంజు భార్గవి, భాను ప్రియలా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇన్స్పైర్ అయ్యాం, అలా మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్స్పైర్ చేసే మూవీస్, సిరీస్ లు ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది, అని ఆమె అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prashanthi Harathi
  • Prashanthi Harathi Interview

తాజావార్తలు

  • Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం

  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!

  • West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

  • Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్‌ స్టార్స్‌.. ఇక్కడ టాప్‌ పొజిషన్‌.. హిందీలో ఫ్లాపులు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions