NTV Telugu Site icon

Actress Pragathi: మరోసారి హాట్ లుక్ లో ప్రగతి.. హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదట

Pragathi

Pragathi

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా కనిపించి మెప్పించింది. గ్రీన్ కలర్ సింగిల్ పీస్ స్లీవ్ లెస్ టాప్ లో హాట్ గా కనిపించి ఫిదా చేసింది.

పొడవైన జుట్టును పైకి ముడి పెట్టి, నల్ల కళ్ళద్దాలతో అదరగొట్టేసింది. మరి ముఖ్యంగా అమ్మడి జబ్బపై ఉన్న టాటూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. వావ్ .. ప్రగతి ఆంటీ .. హీరోయిన్ కు  మీరు ఏ మాత్రం తక్కువ కాదు అని కొందరు.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎలాగో ప్రగతి ని చూసి నేర్చుకోవాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రగతి పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.

Show comments