Actress Pooja Murthy Bigg Boss Entry Cancelled: ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టీజర్లు, ప్రోమోలు సోషల్ మీడియాలో ఇప్పటికే సందడి చేస్తున్నాయి అయితే బిగ్ బాస్ 7 సీజన్లో అడుగుపెడుతున్న ఒక కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో చివరి నిమిషంలో ఆమె డ్రాప్ అయింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పూజా మూర్తి కన్నడ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగులో గుండమ్మ కథ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన సూపర్ క్వీన్ అనే కార్యక్రమంలో కూడా పాల్గొని మంచి గుర్తింపు సంపాదించింది. ఆమెను బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా రమ్మని ఆహ్వానించడంతో వెళ్లేందుకు కూడా సిద్ధమైంది. ఈరోజు రేపు హౌస్ లోకి ఎంటర్ అయ్యే క్రమంలో ఆమె డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసింది.
Rajini: సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు… 100 కోట్ల సింగల్ చెక్
Tragedy at Actress Pooja Murthy house:అయితే చివరి నిమిషంలో ఆమె తండ్రి మరణించినట్లుగా వార్త రావడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకుండా డ్రాపై ఇంటికి బయలుదేరింది. కొద్దిసేపటి క్రితమే తన తండ్రి మరణించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిన ఆమె తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి తాను తన తండ్రి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఒకవేళ కుదిరితే వెనక్కి వచ్చేయమని ఆమె కామెంట్ చేసింది. మీరు లేరనే విషయాన్ని ప్రతి సెకన్, నేను ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను, నాకు తెలిసి చేసినా తెలియక చేసినా, ఏదైనా పొరపాటు చేసి ఉంటే సారీ. నాకు తెలుసు మీరు ఎప్పుడూ నాతోనే ఉంటారు మీ ఆశీస్సులు కూడా ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నా మీద అమ్మ మీద మీ ఆశీస్సులు నిరంతరం ఉంటాయని భావిస్తున్నాము, రెస్ట్ ఇన్ పీస్ డాడీ అంటూ ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.