NTV Telugu Site icon

Madhu Shalini: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.. వరుడు ఎవరంటే..?

Madhu Shalini

Madhu Shalini

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది.

ఇక ఇటీవలే 9 అవర్స్ వెబ్ సిరీస్ లో తారకరత్న భార్యగా , జర్నలిస్ట్ గా నటించి మెప్పించిన ఈ భామ సీక్రెట్ గా వివాహమాడింది. తమిళ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్ లో చిన్న చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో హీరోగా నటించాడు. వీరిద్దరూ కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సెట్స్ లోనే వీరి పరిచయం ప్రేమ వరకు వెళ్లి పెళ్ళికి దారి తీసినట్లు తెలుస్తోంది.

ఇక పెళ్లి తరువాత మధుశాలిని తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మాకు ఇప్పటివరకు మీరు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు. ఇక నుంచి మేము ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కాగా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments