Kalyani Priyadarshan : హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గానే కొత్త లోకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది. రూ.266 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. దీంతో కల్యాణి ఫుల్ హ్యాపీలో ఉంది. ఈ సినిమా రిజల్ట్ తో ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో ఉన్నట్టు తెలిపింది.
Read Also : Robo Shankar : రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య
నేను, నా సోదరుడు చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో ఉన్నాం. మా నాన్న ప్రియదర్శన్ ధనవంతుడే అయినా.. మమ్మల్ని అలా పెంచారు. ఎందుకంటే డబ్బు, హోదా, లగ్జరీ అనే వాటికి దూరంగా ఉంటేనే జీవితంలో బాధ్యతలు తెలుస్తాయనేది ఆయన ఉద్దేశం. ఆయన నేర్పించిన విలువలే మాకు ఈ రోజు ఉపయోగపడుతున్నాయి. అవే మమ్మల్ని ఇప్పుడు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకునేలా చేశాయి అంటూ ఎమోషనల్ అయింది కల్యాణి. మనకు తెలిసిందే కదా.. కల్యాణి పేరెంట్స్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ అని.
Read Also : OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
