Site icon NTV Telugu

ఆ నిధులు ఏంచేశారు..?: నటి హేమ సూటి ప్రశ్న

‘మా’ అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. పోటీదారుల ఆరోపణలు, విమర్శలతో ‘మా’ అధ్యక్ష పోరు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని ఆమె ఆరోపించారు. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. మరి దీనిపై నరేశ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Exit mobile version