Site icon NTV Telugu

VISHAL : హీరో విశాల్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే.?

Vishal

Vishal

కోలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థత గురైనా సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు విశాల్. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు విశాల్. అనంతరం విశాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read : Hollywood : భయపెడుతున్న ది కంజురింగ్ లాస్ట్ రైట్స్

కాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అయన మేనేజర్ అధికారక నోట్ విడుదల చేస్తూ ‘ విశాల్ ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చేందుకు ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు, విశాల్ కొద్దిసేపు అలసటతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం విశాల్ భోజనం చేయలేదు, కేవలం ఒక జ్యూస్ మాత్రమే తాగాడు, దీని వల్ల విశాల కాస్త నీరసంగా ఉన్నాడు. ఒంట్లో శక్తి తగ్గి డీ హైడ్రేట్ అయి పడిపోయాడు. దాంతో వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి తగు వైద్య పరిక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది మరియు భవిష్యత్తులో క్రమం తప్పకుండా భోజన సమయాలను కొనసాగించాలని సూచించింది. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు మరియు విశ్రాంతితో కోలుకుంటున్నాడు. విశాల్ పట్ల మీ అందరు చూపిన ప్రేమకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’ అని విశాల్ ఫామిలీ ఫ్యాక్టరీ నుండి అధికారక నోట్ రిలీజ్ చేసారు.

Exit mobile version