Site icon NTV Telugu

Comedian Prudhvi raj : పవన్ పై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు.. దిష్టి అంటూ

tollywood

tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటివరకు పవన్ పై దుమ్మెత్తిపోసిన పృథ్వీ తాజగా పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ భీమ్లా నాయక్ పై ప్రశంసలు కురిపించాడు. “భీమ్లా నాయక్ చిత్రాన్ని తాడేపల్లిలో చూశాను.  అప్పుడెప్పుడో రామారావు గారు నటించిన అడవి రాముడు సినిమాకి ఇంత భారీగా జనాలు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకే ఇంత మంది ని చూస్తున్నాను. పవన్ పెద్ద సక్సెస్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. పవన్ అభిమానులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి మంచి సినిమాలో భాగం అవ్వనందుకు బాధగా ఉంది. ఈ సినిమాతో పవన్ కి దిష్టి తగిలి ఉంటుంది” అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మొన్నటివరకు విమర్శించిన పృథ్వీ రాజ్ ఇలా ఒకేసారి పవన్ ని పొగడడమేంటి ..? ఇందులో ఏమైనా మతలబు ఉందా అని ఆలోచిస్తున్నారు.

Exit mobile version